రేపు 10గ్రామాల్లో విద్యుత్ కోత

KKD: గొల్లప్రోలు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆర్డీఎస్ పథకంలో భాగంగా కొత్తగా విద్యుత్ లైన్ల పనులు చేపట్టేందుకు ఆదివారం ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తునట్లు ఈఈ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని 10 గ్రామాల్లో విద్యుత్ ఉండదని, కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.