నేడు కాకినాడ కలెక్టరేట్‌లో డీఆర్‌సీ సమావేశం
కాకినాడ కలెక్టరేట్‌లో మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరగనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశంలో జిల్లాలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించనున్నారు.