'చెత్త బయట వేస్తే చర్యలు తీసుకుంటాం'

MNCL: చెత్తను బయట వేస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఉదయం లక్షెట్టిపేట పట్టణంలోని అంగడి బజార్, బస్టాండ్ ఏరియా, క్లబ్ రోడ్, తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులతో చేపట్టిన పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. వ్యాపారులు, ప్రజలు చెత్తను రోడ్డుపైన పడవేయక కార్మికులకు ఇవ్వాలని సూచించారు.