ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు వెంటనే చెల్లించాలి

ASR: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ అరకు మండల నేత చిట్టం నాయక్ డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి పథకం వేతనదారులకు బకాయి పడిన రెండు నెలల వేతనాలు వెంటనే మంజూరు చేయాలన్నారు. ఈమేరకు గురువారం గన్నెలలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు గత 3నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు.