గిద్దలూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌గా హసీనా

ప్రకాశం: గిద్దలూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌గా కొమరోలు మండలం హనుమంతురాయనిపల్లె గ్రామానికి చెందిన టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకురాలు షేక్ హసీనాను ఎంపిక చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు హసీనా కృషి చేశారు. పలువురు రాజకీయ నేతలు ఆమెను అభినందించారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని హసీనా తెలిపారు.