ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

PLD: వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి, ప్రజల నుంచి వచ్చిన సమస్యల అర్జీలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినిపించగా, వాటిపై వెంటనే స్పందించారు. అర్జీలపై సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా వివరణ కోరుతూ, సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.