VIDEO: బస్సులు లేక గంటల తరబడి నిరీక్షణ

VIDEO: బస్సులు లేక గంటల తరబడి నిరీక్షణ

CTR: పలమనేరు నుంచి బెంగళూరు వైపు వెళ్లే బస్సులు లేక రోడ్డుపైనే గంటల తరబడి ఎదురుచూస్తున్నట్లు ప్రయాణికులు వాపోయారు. తిరుపతి, చిత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్లే బస్సుల్లో పూర్తిగా నిండిపోవడంతో నిల్చోలేక ఇబ్బంది పడుతున్నామన్నారు. ఈ సమస్య వారాంతపు సెలవుల అనంతరం మరీ ఎక్కువగా ఉందన్నారు. అధికారులు స్పందించి మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు.