పనులను పరిశీలించిన హోంమంత్రి
AKP: రాంబిల్లి మండలం రజాల వద్ద శారదా నది గండి పూడ్చే పనులను హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం పరిశీలించారు. జిల్లాలో 2,000 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 100 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో తమలపాకు తోటలో దెబ్బతింటే ఎకరానికి రూ.15,000 ఇచ్చేవారని కూటమి ప్రభుత్వం పరిహారాన్ని రూ. 75,000 పెంచిందన్నారు.