పహానిలో పేర్ల మార్పు.. స్పందించిన కలెక్టర్

SRPT: గరిడేపల్లి మండలంలో కల్మరచెరువు గ్రామానికి చెందిన నాగమణి భూమి పహానిలో ఇతరుల పేర్లు తప్పుగా రాయబడిన ఘటన చోటుచేసుకుంది. ఈ విషయంపై కలెక్టర్ తేజస్ నందా లాల్ పవార్ తీవ్రంగా స్పందించారు. తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేసి, బాధ్యులపై పోలీస్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. పూర్తిగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.