మంత్రి నిమ్మల దృష్టికి నీటిపారుదల సమస్యలు

గజపతినగరం నియోజకవర్గ పరిధిలో గల నీటిపారుదల సమస్యలను బుధవారం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో టీడీపీ శ్రేణులు మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. బివి ఛానల్, 13 వంతుల కాలువ, తాటిపూడి ఆయకట్టు జలాసాయాన్ని పూర్తిగా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని గజపతినగరం మార్కెట్ కమిటీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.