వినాయక పల్లిలో 104 వైద్య శిబిరం
VZM: ఎస్ కోట మండలం వినాయక పల్లిలో కొట్టాం పీహెచ్‌సీ వైద్యురాలు హారిక ఆధ్వర్యంలో సోమవారం 104 వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా బిపి, షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందజేశారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి దేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.