'కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి'

'కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి'

SRD: పటాన్‌చెరులో కార్మిక వ్యతిరేక కోడ్‌లను రద్దు చేయాలని బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ESI హాస్పటల్ నుంచి NH-65 వరకు జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు నరసంహారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాల లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించి అమలు చేయాలని కోరారు.