నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
GNTR: గుంటూరులో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.గుంటూరు టౌన్-2 డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గురవయ్య తెలిపిన వివరాల ప్రకారం..విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్రాడీపేట, పండరీపురం, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ అంతరాయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.