రాజంపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

అన్నమయ్య: జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రాజంపేట మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని కమిషనర్ కోరారు. ముందుగానే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుందామని ఆయన పిలుపునిచ్చారు.