VIDEO: గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించొద్దు: CPI
KMM: వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించవద్దని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మహమ్మద్ సలాం డిమాండ్ చేశారు. ఇవాళ ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. యుద్ధం పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.