నిర్మానుష్యంగా రోడ్లు

NRML: బాసరలో హిందూ ఐక్య సంఘాల పిలుపు మేరకు నేడు బంద్ ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించి మద్దతు తెలిపారు. బంద్ కారణంగా సరస్వతి ఆలయ పరిసర ప్రధాన రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి.