సుస్థిర ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యం: గనిశెట్టి
కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీతోనే సుస్థిర పాలన సాధ్యం అని అన్నారు. పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.