కాజీపేట రైల్వే స్టేషన్లో తనిఖీ చేసిన పోలీసులు
HNK: నేరాల నియంత్రణ, పాత నేరస్థుల గుర్తింపు కోసం కాజీపేట రైల్వే స్టేషన్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ సహాయంతో పరిశీలిస్తున్నట్లు కాజీపేట ఎస్సై లవణ్ కుమార్ తెలిపారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.