విసన్నపేటలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
ఎన్టీఆర్: విసన్నపేటలో ఆదివారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ప్రసన్నపేటలోని బీజేఆర్ నగర్లో నివాసం ఉంటున్న జొన్నలగడ్డ ఏసురక్తం అనే వ్యక్తి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మృతి చెందారు. భవన నిర్మాణ కూలి పనుల నిమిత్తం వెళ్లిన అతనికి 11కేవీ వైర్లు తగిలి కింద పడటంతో పదునైన ఆయుధం గుచ్చుకొని మృతి చెందినట్లు తెలిపారు.