మాక్ అసెంబ్లీ విద్యార్థినికి అభినందనలు
AKP: అమరావతిలో ఇటీవల జరిగిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో నర్సీపట్నం మండలం వేములపూడి మోడల్ స్కూల్ విద్యార్థిని శ్రేష్ట గీతిక పాల్గొన్నారు. ఈ నేపద్యంలో శుక్రవారం విద్యార్థినిని ప్రిన్సిపల్ సంధ్య ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. 9వ తరగతి చదువుతున్న గీతిక విలువైన అభిప్రాయాలు తెలియజేసి పాఠశాల గౌరవాన్ని నిలబెట్టిందని కొనియాడారు.