అమ్మవారి హుండీలో భారీగా విదేశీ కరెన్సీ

అమ్మవారి హుండీలో భారీగా విదేశీ కరెన్సీ

కృష్ణా: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి హుండీ లెక్కింపులో భారీగా విదేశీ కరెన్సీ లభ్యమైంది. ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈవో పర్యవేక్షణలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా 403 అమెరికా డాలర్లు, 115 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్స్, 25 కెనడా డాలర్లు, 22 ఒమన్ రియాల్త్సో పాటు సింగరపూర్, సౌదీ, ఖతార్, కువైట్, థాయిలాండ్ దేశాలకు కరెన్సీ కూడా లభించిందని తెలిపారు.