పట్టణ పద్మశాలి మహిళా విభాగం నూతన కార్యవర్గం
SRD: ఖేడ్ పట్టణ పద్మశాలి మహిళా విభాగం నూతన కార్యవర్గాన్ని సోమవారం శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షురాలిగా చిప్ప సరిత, ఉపాధ్యక్షులుగా సుజాత, జ్యోత్స్న, జనరల్ సెక్రెటరీ సునీత, ముఖ్య సలహాదారుగా జయశ్రీ, కోశాధికారిగా ఇందు, ప్రశాంతి, సభ్యులుగా సదాలక్ష్మి, స్వర్ణ, శ్రీదేవి, ముఖ్య సభ్యులుగా స్వరూప, సుజాత, ఉమావతి, శాంతమ్మను ఎన్నుకున్నారు.