అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో షారుఖ్ ఫ్యామిలీ
ముంబైలో జరిగిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ సందడి చేశాడు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్‌లతో కలిసి హాజరైన షారుఖ్.. వైట్ అండ్ క్రీమ్ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించాడు. గౌరీ మస్టర్డ్ చీరలో, సుహానా గోల్డ్ లెహంగాలో మెరిసిపోయారు. ఈ స్టార్ ఫ్యామిలీ రాకతో వేడుకలో ప్రత్యేక ఆకర్షణ నెలకొంది.