బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
BHNG: భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోటే బిక్షపతి, ముడుగుల ఉపేందర్, మోటే నరసింహ, వడ్డెరి రాజులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సమక్షంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.