VIDEO: పశువులకు వ్యాక్సిన్ చేస్తున్నాము: పశు వైద్యాధికారిణి

BDK: పశువుల్లో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యశాలలో సంప్రదించాలని పశు వైద్యాధికారిణి శిరీష సూచించారు. శుక్రవారం పినపాక మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో ఆమె మాట్లాడారు. గ్రామాలలో పశువులకు శరీరంపై బొబ్బలు కనిపిస్తే గమనించి తెలియజేయాలన్నారు. ఆ పశువులకు వ్యాక్సిన్ వేస్తున్నామని, పశు యజమానులు సహకరించాలని కోరారు.