గ్లోబల్ సమ్మిట్.. 27 ప్రత్యేక సెషన్లు

గ్లోబల్ సమ్మిట్.. 27 ప్రత్యేక సెషన్లు

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారైంది. డిసెంబర్ 8, 9న జరిగే సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. ఈ నెల 9న సాయంత్రం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్‌ను ప్రకటిస్తారు. ఈ సదస్సులో పలువురు క్రీడా, సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు.