డంపింగ్ యార్డ్ హటావో.. నర్సాపూర్ బచావో కార్యక్రమం

MDK: నర్సాపూర్ బస్టాండ్ ఆవరణలో ఉన్న బృందావన్ బేకరీ ముందు డంపింగ్ యార్డు పనులకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష చేశారు. దీనిలో భాగంగా డంపింగ్ యార్డ్ హటావో.. నర్సాపూర్ బచావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ పాల్గొనాలని అఖిలపక్ష నాయకుడు రాంచందర్ కోరారు. దీక్షలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.