'రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి'

NTR: అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా కౌలు రైతులకు అన్యాయం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ ధ్వజమెత్తారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని దాసరి భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రామక్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.