ఘనంగా ములాయం సింగ్ యాదవ్ జయంతి వేడుకలు
SKLM: టెక్కలి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం యాదవ్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురునాథ్ యాదవ్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.