VIDEO: 'నెలాఖరులోగా కార్మికులకు లాభాల వాటా చెల్లించాలి'

VIDEO: 'నెలాఖరులోగా కార్మికులకు లాభాల వాటా చెల్లించాలి'

MNCL: ఈ నెలాఖరులోగా సింగరేణి కార్మికులకు లాభాల వాటా చెల్లించాలని BMS రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. మందమర్రి పట్టణంలో మంగళవారం మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలను చెల్లించడంలో సింగరేణి యాజమాన్యం జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో చెల్లించాల్సిన వాటా ఇంతవరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.