రాయవరంలో ఘనంగా గణేష్ నిమజ్జనం

రాయవరంలో ఘనంగా గణేష్ నిమజ్జనం

NGKL: లింగాల మండలంలో పాత రాయవరం గ్రామంలో గణేష్ నిమజ్జనం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. తొమ్మిది రోజుల పూజల తర్వాత భక్తులు గణనాథుడిని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేస్తున్నారు. గ్రామస్థులు వినాయక నిమజ్జన వేడుకలను వైభవంగా నిర్వహించారు. భక్తి పాటలతో ఆడుతూ, పాడుతూ, భజనలు చేస్తూ వినాయకుడిని నిమజ్జనం చేశారు.