VIDEO: బావిలో పడి తండ్రి–కుమారుడు మృతి
మహబూబాబాద్ మండలం బలరాం తండాలో విషాద ఘటన శనివారం జరిగింది. వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన కేలోత్ మదన్ (40), అతని కుమారుడు జస్వంత్ (2.5) ప్రమాదవశాత్తు బావిలో పడ్డారు. కుమారుడిని కాపాడేందుకు బావిలోకి దూకిన తండ్రి కూడా మునిగి మృతి చెందాడు. తండ్రి మృతదేహాన్ని తండావాసులు వెలికి తీయగా, బాలుడి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.