పట్ట పగలే వెలుగుతున్న లైట్లు!
GDWL: గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో నిర్విరామంగా 24 గంటలు వీధి లైట్లు వెలుగుతున్నాయని స్థానికులు సోమవారం వాపోయారు. ఆటోమేటిక్ టైమర్ల లోపం, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కొద్ది రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా దీపాలు వెలుగుతూ ఉంటున్నాయన్నారు. ఉన్నతాధికారుల తక్షణమే స్పందించి ఈ సమస్యను తొలగించాలని కాలనీ వాసులు పేర్కొన్నారు.