ఉపాధ్యాయురాలిపై హత్యాయత్నాన్ని ఖండించిన ఎమ్మెల్సీ
NLR: గూడూరులో ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలిపై అత్యంత పాశవికంగా దుండగుడు కత్తితో దాడి చేయడం దుర్మార్గమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత ఉపాధ్యాయురాలికి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని కోరారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు సమాజంలో భద్రత లేకపోవడం దురదృష్టకరమన్నారు.