WC: రేపు టీమిండియా జెర్సీ విడుదల

WC: రేపు టీమిండియా జెర్సీ విడుదల

2026 ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఈ మెగాటోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టు ధరించే కొత్త జెర్సీని రేపు ఆవిష్కరించనున్నారు. రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరిగే రెండో వన్డే సందర్భంగా ఈ జెర్సీ విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు.