ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కొరత

KDP: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని ఎంఆర్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో తగిన మేరకు సిబ్బంది లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని CPI మండల కార్యదర్శి ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ అభివృద్ధి సమస్యలతో మండల ప్రజలు కార్యాలయాలకు వస్తే సంబంధిత అధికారులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇంఛార్జ్‌లను తొలగించి రెగ్యులర్ అధికారులను నిర్మించాలన్నారు.