నిజాంపేటలో రూ.1300 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

నిజాంపేటలో రూ.1300 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

HYD: బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామంలో 13 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ దాదాపు రూ. 1,300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సర్వే నంబర్లు 186, 191తో పాటు 334లో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని, దానిని కాపాడాలని బాచుపల్లి రెవెన్యూ అధికారులు హైడ్రాను కోరారు. ఆక్రమణల వల్ల ఇప్పటికే కొంత భూమి కబ్జాకు గురైందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.