నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్
RR: ఎన్నికల కోడ్ నేపథ్యంలో చివరి విడత ఎన్నికలు పోరు జరిగే గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. యాచారం మండలంలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ రోజు (17వ తేదీ) సాయంత్రం 5 గంటల వరకు మూసేసి ఉంటాయని అధికారులు తెలిపారు. యాచారం, మేడిపల్లి, మాల్, గున్గల్ గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాలను బంద్ చేయనున్నట్లు పేర్కొన్నారు.