VIDEO: కలెక్టర్ కార్యాలయం వద్ద బస్టాండ్ పూర్తి
మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయం సముదాయం వద్ద బస్టాండ్ నిర్మించాలని స్థానికులు చేసిన విజ్ఞప్తి, దానిపై వచ్చిన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. ప్రజా సమస్యను గుర్తించిన శాఖలు పరస్పర సమన్వయంతో కొత్త బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేశాయి. దీర్ఘకాలంగా ఉన్న ప్రయాణ ఇబ్బందులు తొలగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.