చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా నిలిచాడు. సౌతాఫ్రికా-Aతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (68*) చేసిన రుతురాజ్ లిస్ట్-ఏ సగటు 57.80కి చేరింది. దీంతో పుజారా (57.01)ను అధిగమించి లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు.