ఈనెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు ఈనెల 28న సీఎం నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. సుమారు రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందన్నారు. ఈ ప్రాజెక్ట్ 2028 నాటికి పూర్తవుతుందని పేర్కొన్నారు. దీంతో జిల్లా ప్రజలకు అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.