కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంటుంది: ఎమ్మెల్యే

BDK: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కొత్తగూడెం, కొప్పురాయి గ్రామంలోని ఉపాధి హామీ శ్రామికులకు గడ్డపార, బాస్కెట్లను ఎమ్మెల్యే అందజేశారు. గడిచిన ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రజలకు అందించిందని ఎమ్మెల్యే తెలిపారు. మున్ముందు అనేక పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.