చిరుతపులి సంచరిస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్
VKB: తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామ శివారులో జీవంగి రోడ్డు మార్గంలో చిరుతపులి సంచరిస్తుందంటూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన పోస్టు ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వాహనదారులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. రాత్రి ప్రయాణం చేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని అందులో చెప్పుకొచ్చాడు. అయితే ఇది నిజమా ? కాదా ? అని ఫారెస్ట్ అధికారులు నిర్ధారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు.