విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఛైర్మన్
VZM: కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో నూతనంగా నిర్మించిన మరిడిమాంబ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి సమర్పించిన పూర్ణహారతి కార్యక్రమంలో పాల్గొని, వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు.