'రాజన్న రాజీగో ఓట్ల పండగ వచ్చింది' పాట
SDPT: అక్కన్నపేట మండలం పోతారం (జె) గ్రామానికి చెందిన 87 ఏళ్ల బోనగిరి వెంకటయ్య, ఎన్నికల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ 'రాజన్న రాజీగో ఓట్ల పండగ వచ్చిందంటూ' పాట పాడి గ్రామస్థులను ఆకట్టుకున్నారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగవద్దని ఆయన తన పాట ద్వారా పిలుపునిచ్చారు. ఈ పాట గ్రామస్థులను విశేషంగా ఆకట్టుకుంది.