ఒంటిమిట్ట కోదండరాముని రథం సిద్ధం

ఒంటిమిట్ట కోదండరాముని రథం సిద్ధం

KDP: రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటలకు సీతారాముల కళ్యాణం మహోత్సవం జరగనుంది. శనివారం సీతారామ లక్ష్మణ మూర్తులను ఊరేగింపు కోసం టీటీడీ అధికారులు రధం సిద్ధం చేశారు. రథాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.