'ఏలూరు మిమ్మల్ని నమ్ముతోంది'.. ఎంపీకి మద్దతుగా ఫ్లెక్సీ'
ELR: మొయినాబాద్ ఫామ్ హౌస్లోలో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పట్టుబడిన సంగతి తెలిసిందే. కాగా ఆయనకు మద్దతు తెలుపుతూ.. ఏలూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. 'ఎంపీ తరఫున దృఢంగా నిలబడుతున్నాం. మేము మీతో ఉన్నాం. ఏలూరు మిమ్మల్ని నమ్ముతోంది' అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అయితే ఇవి ఎవరు ఏర్పాటు చేశారనేది తెలియరాలేదు. ఫ్లెక్సీలోనూ పేర్కొనలేదు.