VIDEO: జాతీయ రహదారిపై విద్యార్థుల ఆందోళన
MDK: కౌడిపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు మెనూ ప్రకారం భోజనం సరఫరా చేయడం లేదని, హాస్టల్ సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించిన విద్యార్థులు, ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.