LPG కొరతపై సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్

LPG కొరతపై సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్

రాష్ట్రంలో ఎల్పీజీ కొరతతో ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులపై TPCC నేత సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నా కేంద్ర, రాష్ట్ర విపక్షాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉచిత బస్సు పథకంపై నానా యాగీ చేసిన BRS, BJP నేతలు.. ఇప్పుడు ఆటో అన్నల కష్టాలపై ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. బీజేపీపై ఉన్న భక్తే BRS నేతలకు అడ్డు వస్తోందా? అని ప్రశ్నించారు.