సైబర్ నేరగాళ్లను పట్టుకున్న పోలీసులు

సైబర్ నేరగాళ్లను పట్టుకున్న పోలీసులు

VZM: బొబ్బిలి పట్టణానికి చెందిన టీచర్‌ చింత రమణను “సీబీఐ అధికారులు” అంటూ నమ్మించి రూ.22 లక్షలు మోసం చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు గురువారం పట్టుకున్నారు. చెన్నైకి చెందిన నలుగురు సునీల్ సుతార్, సతీష్, రాజేష్ పాల్‌, మహ్మద్ ఇర్ఫాన్ అరెస్టయ్యారని, ప్రధాన నిందితుడు రాజస్థాన్‌కి చెందిన వినోద్ చౌదరి పరారీలో ఉన్నాడని చెప్పారు.